హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
,, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ సీటు వస్తే జాక్‌పాట్ కొట్టినట్లే. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఏదైనా సరే.. సీటు వచ్చిందంటే.. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పక్కా. ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షలో తక్కువ ర్యాంకు తెచ్చుకునేందుకు కష్టపడుతుంటారు. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ముగిసేసరికి క్యాంపస్‌లో 13 బ్రాంచుల్లో 58 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లోనే 30 సీట్లు మిగిలాయి. చాలామంది విద్యార్థులు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.లక్షల డొనేషన్లు చెల్లించి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో చేరుతుండగా.. క్యాంపస్‌లో మాత్రం సీట్లున్నాయి. ఎప్‌సెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించినవారు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో చేరారని.. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ సీట్ల భర్తీ కోసం జరుగుతున్న సీ-శాట్ కౌన్సెలింగ్ శనివారం వరకు ఉన్నందున మూడో విడతలో ఖాళీలు భర్తీ అవుతాయని జేఎన్‌టీయూ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ