హెచ్సీఏ నిధుల గోల్మాల్ కేసు స్పీడప్! ఉప్పల్ స్టేడియంలో CID కీలక విచారణ
హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలో నిబంధనల ఉల్లంఘటన, నిధుల గోల్ మాల్ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు స్పీడప్ పెంచినట్లు తెలుస్తోంది. హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ను సీఐడీ అధికారులు జూలై 25న అరెస్ట్ చేసిన విషయం తెలిసిం
CID


హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలో నిబంధనల ఉల్లంఘటన, నిధుల గోల్ మాల్ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు స్పీడప్ పెంచినట్లు తెలుస్తోంది. హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ను సీఐడీ అధికారులు జూలై 25న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను 7 రోజుల పాటు కస్టడీకి తీసుకొని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఐదో రోజు కస్టడీలో దేవరాజ్ విచారాణ షురూ అయింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న హెచ్సీఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. .

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande