తెలంగాణ, కరీంనగర్. 11 ఆగస్టు (హి.స.) కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని
మధురానగర్ లో సోమవారం పోలీసులు కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. కరీంనగర్ కమిషనర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలులేని 100 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వాటిలో 96 మోటార్ సైకిళ్లు, 2 ఆటో రిక్షాలు, 1 కార్, 1 ట్రాక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ప్రజలకు సైబర్ నేరాల పై చైతన్యం పరుస్తూ, సైబర్ మోసాల నివారణ పై పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు