.గోరంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విస్తృత.ఉపాధ్యాయుని ఇంటిలో.చోరీ
అమరావతి, 11 ఆగస్టు (హి.స.) గోరంట్ల, : గోరంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పాముదుర్తి చలపతి ఇంటిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. రూ.2 లక్షలకుపైగా నగదు, 114 గ్రాముల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు తె
.గోరంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విస్తృత.ఉపాధ్యాయుని ఇంటిలో.చోరీ


అమరావతి, 11 ఆగస్టు (హి.స.)

గోరంట్ల, : గోరంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పాముదుర్తి చలపతి ఇంటిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. రూ.2 లక్షలకుపైగా నగదు, 114 గ్రాముల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. మూడు రోజులు వరుస సెలవులు కావడంతో భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి శృంగేరీలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆ మార్గంలో ఉండే ఆలయాలు చూసుకుంటూ వస్తున్నారు. శనివారం రాత్రి కర్ణాటకలోని చిక్కమగళూరులో బసచేశారు. ఉదయం ఆరు గంటలకు ఇంటి తలుపులు తీసి ఉన్నాయని పక్కింటి వారు తెలపడంతో భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లిచూడగా చోరీ జరిగిన విషయం వెలుగుచూసింది. చోరులు ప్రధాన తలుపుకు వేసిన డోర్‌లాక్‌ తొలగించి ఇంటిలోకి ప్రవేశించారు. ఒకగదిలో ఉన్న బీరువా మాత్రం తీసి అందులో లభించిన బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. రాత్రి 1.33 గంటల నుంచి 2.33 గంటల మధ్య ఈసంఘటన జరిగినట్లు సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. .

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande