అమరావతి, 11 ఆగస్టు (హి.స.)
: ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో హిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై () ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 'స్త్రీ శక్తి ' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల(ఆగస్టు) 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఐదు కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల్లో వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ