తెలంగాణ, ఆదిలాబాద్. 10 ఆగస్టు (హి.స.)
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించినట్లే, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆదరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం నూతన సాత్నాల మండలకేంద్రంలో ఆయన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు