బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు.. కాంగ్రెస్పై రెచ్చిపోయిన రాంచందర్ రావు
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారన
బిజెపి చీఫ్


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల

బాలరాజు బీజేపీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అన్నారు. గువ్వల బాలరాజు కూడా ఆ విషయాన్ని ముందుగానే గుర్తించి రావడం అభినందనీయమని అన్నారు. అచ్చంపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభివృద్ధికి గువ్వల బాలరాజు కృషి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించాలని పార్టీ శ్రేణులకు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మోడీని విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. మళ్లీ ఓటమి తప్పదనే విషయాన్ని రాహుల్ ముందే గుర్తించారని.. అందుకే ఈసీపై, మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. మోడీ పాలన, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు నచ్చే బీజేపీలో చేరానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande