70 ఏళ్లు దాటిన అందరికీ ఆయుష్ మాన్ భారత్.. కిషన్ రెడ్డి
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జన ఔషధీ పరియోజన ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి భారతీయ జనసౌది పరియోజన (PMBJP) తెలంగాణ మార్కెటింగ్ కం డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్ వారి సహకారంతో ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జన ఔషధీ పరియోజన ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి భారతీయ జనసౌది పరియోజన (PMBJP) తెలంగాణ మార్కెటింగ్ కం డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్ వారి సహకారంతో ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేశారు.. ఈ వేర్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడారు.

మోడీ ప్రభుత్వం 5 లక్షలు ఆయుష్ మాన్ భారత్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. రిటైర్మెంట్ 70 సంవత్సరాలు దాటిన అందరికీ ఆయుష్ మాన్ భారత్, కులాలతో సంబంధం లేకుండా ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతీ గల్లీలో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని.. ఈ జన ఔషధ కేంద్రాల్లో మందులు అందే విధంగా చూస్తున్నామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande