కృష్ణానగర్లో సినీ కార్మికుల ఆందోళన..
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) టాలీవుడ్లో గత వారం నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంత
సినీ కార్మికులు


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

టాలీవుడ్లో గత వారం నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో, కృష్ణానగర్లో 24 క్రాఫ్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఆదివారం భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ నిరసనలో పలువురు నేతలు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫైటర్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ - మాకు స్కిల్ లేదని ఎలా అంటారు? స్కిల్ లేకపోతే ఇంతకాలం వందల సినిమాల్లో ఎలా పని చేసాం? అని ప్రశ్నించారు. తాము ఎటువంటి అనవసర ఒత్తిడి చేయడం లేదని, కానీ తమ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వేతనాలు పెంచాలని అడిగితే కేసులు వేయడం సరికాదని వారు మండిపడ్డారు. సినిమాల్లో వచ్చే లాభాల్లో వాటాలు అడగడం లేదు, కేవలం మా కష్టానికి సరిపడే వేతనం మాత్రమే కోరుతున్నాం అని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande