రాజకీయాలపై మాట మార్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌పై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటమార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు పెడతానని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. ప్రస
మంత్రి మల్లారెడ్డి


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌పై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటమార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు పెడతానని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నానని.. ఆ పార్టీలోనే కొనసాగుతానని తేల్చిచెప్పారు. తాను తెలుగుదేశం, బీజేపీ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు మల్లారెడ్డి.

జపాన్‌లో ఏ విధంగా రిటైర్‌మెంట్ ఉండదో.. రాజకీయానికి కూడా రిటైర్‌మెంట్ ఉండదని మాత్రమే తన మిత్రుడితో అన్నానని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఇవాళ(ఆదివారం) జవహర్‌నగర్‌లో మల్లారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఇంత‌కుముందు ఏమ‌న్నారంటే..?తాను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని… తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నానని తెలిపారు. తాను ఇప్పుడు ఏ వైపునకు చూసేటట్లుగా కూడా లేనని చెప్పారు. తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని అన్నారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని వెల్లడించారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande