జూరాలకు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తివేత
జోగులాంబ గద్వాల, 10 ఆగస్టు (హి.స.) జూరాల జలాశయానికి ఆదివారం వరద పోటెత్తింది. గత రెండు రోజులుగా జూరాల ఎగువ ప్రాంతాన కురుస్తున్న వర్షాలకు తోడు కర్ణాటక జలాశయాల నుంచి భారీగా వరద నీరు విడుదల చేయడంతో ఆదివారం ఉదయం జూరాల జలాశయానికి 1,35,000 క్యూసెక్కుల వరద
జూరాల ప్రాజెక్టు


జోగులాంబ గద్వాల, 10 ఆగస్టు (హి.స.)

జూరాల జలాశయానికి ఆదివారం వరద పోటెత్తింది. గత రెండు రోజులుగా జూరాల ఎగువ ప్రాంతాన కురుస్తున్న వర్షాలకు తోడు కర్ణాటక జలాశయాల నుంచి భారీగా వరద నీరు విడుదల చేయడంతో ఆదివారం ఉదయం జూరాల జలాశయానికి 1,35,000 క్యూసెక్కుల వరద చేరింది. నీటి పారుదల శాఖ అధికారులు వరద నీటి నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. 20 గేట్లు ఎత్తివేసి 1,26,110 క్యూసెక్కులను దిగువకు, విద్యుదుత్పత్తి కేంద్రాలకు 29,351 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రధాన కుడి కాలువకు 470, కోయిలసాగర్ పథకానికి 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande