గాంధీభవన్ కు రావొద్దా ఏంటి..? కొండా మురళి సీరియస్
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లోని గాంధీ భవన్ వేదికగా మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశం ప్రారంభం అయింది. వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి గాంధీ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్ర
కొండా మురళి


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్లోని గాంధీ భవన్ వేదికగా

మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశం ప్రారంభం అయింది. వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి గాంధీ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణా కమిటీ కంటే ముందే నేనే వచ్చాను.. గాంధీ భవన్కు రావొద్దా ఏంటి అని అక్కడ పలువురిపై కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, వరంగల్ జిల్లాలో కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కొండా మురళి కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరై ఇప్పటికే తన వాదనను వినిపించారు. తాజాగా మురళి అంశంపై క్రమశిక్షణ సంఘం ఆదివారం సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ కమిటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కూడా చర్చకు వస్తుందని సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande