అర్లి వంతెనతో పాటు మూడు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎమ్మెల్యే పవార్ రామారావు
తెలంగాణ, నిర్మల్. 10 ఆగస్టు (హి.స.) ముధోల్ నియోజకవర్గంలో అర్లి వంతెన నిర్మాణంతో 54 కిలోమీటర్ల మూడు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. జీవో నెం. 389 ద్వారా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో ఈ రోడ్ల
ఎమ్మెల్యే పవర్ రామారావు


తెలంగాణ, నిర్మల్. 10 ఆగస్టు (హి.స.)

ముధోల్ నియోజకవర్గంలో అర్లి వంతెన నిర్మాణంతో 54 కిలోమీటర్ల మూడు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. జీవో నెం. 389 ద్వారా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అర్లి బ్రిడ్జితో పాటు కిష్టపూర్ మీదుగా లోకేశ్వరం వరకు రోడ్ నిర్మాణం జరుగుతుందన్నారు. అదే విధంగా భైంసా నుండి వయా గోడిసేరా నుండి కుబీర్ పార్టీ కె పల్సి, సిరిపెల్లి వరకు 27 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం చేపడతామని, అలాగే ముధోల్ నుంచి వయా సింగన్ గావ్ మీదుగా తానూర్, జాల కె వడ్గావ్ గ్రామం మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు 18 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఉంటుందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande