హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతీ పార్టీలో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలో లాగే బీఆర్ఎస్లోనూ ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈటల రాజేందర్ నేరుగా బండి సంజయ్ కి వార్నింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్లోని వివాదాలను కూడా అలాగే చూడాలని చెప్పారు. ఆ పార్టీ గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. అంతకుముందు సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడారు. HMSతో కలిసి సింగరేణి జాగృతి ముందుకు వెళ్తుందని ప్రకటించారు. లాభాల్లో కార్మికులకు 35% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి లేదంటే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు భరోసా ఇవ్వడానికి అక్టోబర్లో సింగరేణి యాత్ర చేపడుతామని కీలక ప్రకటన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్