తెలంగాణ, ఖమ్మం. 10 ఆగస్టు (హి.స.)
ఖమ్మం జిల్లా వంగవీడులో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. జవహర్ ఎత్తిపోతలజవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పథకం మధిర నియోజకవర్గానికి గేమ్ ఛేంజర్ అని కొనియాడారు. ఈ పథకానికి రూ.630 కోట్లు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. పథకం టెండర్లు కూడా పూర్తి అయినట్లు స్పష్టం చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని వేదికపై నుంచే అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ఒక ఏడాదిలోనే పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. ఈ స్కీమ్ ద్వారా 33 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు