హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో మాత్రలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. 1-19 సంవత్సరాలున్న వారంతా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి, రక్తహీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు ఇవి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్