నారాయణపేట, 10 ఆగస్టు (హి.స.)
శిధిలావస్థలో ఉన్న మక్తల్ పడమటి
ఆంజనేయస్వామి కోనేరును ఆదివారం ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మా ఇంటి ఇలవేల్పు, ఈ ప్రాంతంలో అందరికీ ఇలవేల్పుగా ఉన్న పడమటి ఆంజనేయస్వామి దేవాలయ కోనేరును ఈ తరం యువకులు మర్చిపోయారని, దేవాలయన ప్రధాన ద్వారానికి ఉత్తరం వైపు తీరు మైదానంలో అక్రమ నివాస గృహాల మధ్యన ఆదరణకు నోచుకుపోవడంతో శిధిలావస్థలోకి చేరిందన్నారు. ఆ ప్రాంతం వారు చెత్త కుప్పగా మార్చారని దాని శుభ్రపరచి అభివృద్ధి చేసి భక్తులకు ఉపయోగంలోకి తీసుకురావాలని ఆలయ ధర్మకర్త ప్రాణేశ జారితో అన్నారు.
వందల సంవత్సరాల కిందట విశాలంగా రాతి కట్టడంతో ఉన్న కోనేరును నిరాదరణకు గురి కావడంతో దాన్ని శుభ్రపరచి ఉపయోగులోకీ తీసుకురావడానికి సంబంధిత అధికారులను తో మాట్లాడి దేవాదాయ శాఖ నుంచి నిధులు కేటాయింపు జరిగేలా చూస్తానని ఆయన అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..