నాగార్జునసాగర్, 10 ఆగస్టు (హి.స.)
నాగార్జున జలాశయం నిండుకుండలా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయికి నీటిమట్టం చేరింది. నాగార్జున సాగర్ జలాశయం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులు ఉంది. నీటి నిల్వ 312.04 టీఎంసీలు. జలాశయం ఇన్ఫ్రా 65,827 క్యూసెక్కులు, అవుట్లో 60,644 క్యూసెక్కులు. మరో వైపు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. జూరాల, సుంకేశలు నుంచి వరద ప్రవాహం వచ్చి చేరు తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ప్లే 1,50,857 క్యూసెక్కులు, అవుట్లో 1,00,800 క్యూసెక్కులు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..