తెలంగాణ, నిజామాబాద్. 10 ఆగస్టు (హి.స.)
నిజామాబాద్ జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదివారం సూచించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన దరఖాస్తుదారులకు రూ. 20,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. పథకం ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు