అమరావతి, 10 ఆగస్టు (హి.స.)
ఒంటిమిట్ట: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు మండలాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే ఉండి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. రెండు మండలాలు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ