నెల్లూరు: 10 ఆగస్టు (హి.స.)నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కళాశాలకు చేరుకున్నారు. యాజమాన్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు. విద్యార్థి సంఘాలతో కలిసి కళాశాల ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు బైఠాయించారు. విద్యార్థి సంఘాల నేతలు కళాశాల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో కళాశాల యాజమాన్యం విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ