రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : కలెక్టర్ సందీప్ కుమార్
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 10 ఆగస్టు (హి.స.) రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని కొత్తగా చేర్చేందుకు, ఉన్న కార్డులోంచి పేరు తొలగించేందుకు ఆడిషన్, డిలీట్ ఆప్షన్లు ఉన్నాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. ఆదివారం సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి
రాజన్న కలెక్టర్


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 10 ఆగస్టు (హి.స.)

రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని కొత్తగా చేర్చేందుకు, ఉన్న కార్డులోంచి పేరు తొలగించేందుకు ఆడిషన్, డిలీట్ ఆప్షన్లు ఉన్నాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. ఆదివారం సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించి మాట్లాడారు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్కార్డు ప్రామాణికమైనందున అందరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.

పేదలకు ఇచ్చే సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విధానంలో వన్ నేషన్, వన్ రేషన్ కార్డుతో పేదలు తమకున్న రేషన్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande