తెలంగాణ, సిద్దిపేట. 10 ఆగస్టు (హి.స.) సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకి
బిగ్ షాక్ తగిలింది. రైతు సేవ కార్యక్రమాలతో రాజకీయ అరంగేట్రం చేసిన పార్టీ ముఖ్య నాయకుడు గాదగోని చక్రధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మైనంపల్లి హనుమంత రావు వ్యవహార శైలి మూలంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యనించిన చక్రధర్ గౌడ్ త్వరలో మరికొంత మంది నాయకులు హస్తం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు బాంబ్ పెల్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోన
ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో చేరి న 16 నెలల కాలంలో పార్టీ బలోపేతానికి పాటుపడినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీల నేతలకు బదలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహారించడం మన వేదన కు గురి చేసిందన్నారు. మైనంపల్లి హనుమంత రావు మెదక్, మల్కజ్ గిరి ల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే కేసులు పెట్టించిన పార్టీని అస్థిర పరిచే కార్యక్రమాలకు పునుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు