అమరావతి, 10 ఆగస్టు (హి.స.)
సంచలనం కలిగించిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కేసుదర్యాప్తునకుప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో 11 మంది ఇన్‌స్పెక్టర్లు, పదిమంది ఎస్ఐలను నియమించారు. సిట్‌కు చీఫ్ క్రైమ్స్ డీసీపీ తిరుమలేశ్వర్‌రెడ్డిని నియమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ