వాల్తేరు డివిజన్ పరిధిలోని పార్వతీపురం, సీతా నగరం బొబ్బిలి. సెక్షన్లలో మూడో లైన్.నిర్మాణ పనులు
విశాఖపట్నం, 10 ఆగస్టు (హి.స.) ,:వాల్తేరు డివిజన్‌ పరిధిలోని పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి సెక్షన్‌లో మూడో లైను నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ శనివారం తెలిపారు. మరికొన్నింటి గమ్యాలను
వాల్తేరు డివిజన్ పరిధిలోని పార్వతీపురం, సీతా నగరం బొబ్బిలి. సెక్షన్లలో మూడో లైన్.నిర్మాణ పనులు


విశాఖపట్నం, 10 ఆగస్టు (హి.స.)

,:వాల్తేరు డివిజన్‌ పరిధిలోని పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి సెక్షన్‌లో మూడో లైను నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ శనివారం తెలిపారు. మరికొన్నింటి గమ్యాలను కుదించామని, ఇంకొన్నిటిని రీషెడ్యూల్‌ చేశామని పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ-రాయ్‌పూర్‌ ప్యాసింజర్‌ (58528), విశాఖ-కోరాపుట్‌ ప్యాసింజర్‌ (58538), విశాఖ-భవానిపట్న ప్యాసింజర్‌ (58504). ఈ నెల 20 నుంచి 28 వరకు రాయ్‌పూర్‌-విశాఖ ప్యాసింజర్‌ (58527), కోరాపుట్‌-విశాఖ ప్యాసింజర్‌ (58537), భవానీపట్న-విశాఖ ప్యాసింజర్‌ (58503)ను రద్దు చేశారు. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (17243) ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు గుంటూరు నుంచి విజయనగరం వరకు, తిరుగు ప్రయాణంలో రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17244) ఈ నెల 20 నుంచి 27 వరకూ విజయనగరం నుంచి గుంటూరుకు నడుస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande