హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో కేసు వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులకు ఈడీ అధికారులు లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె రూ. కోట్లు సంపాదించినట్లు సమాచారం.
మొత్తం 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు డాక్టర్ నమ్రతపై ఆరోపణలు ఉన్నాయి. సరోగసీ పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం చేసినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. సుమారు రూ.40 కోట్ల మేర హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..