ప్రధానమంత్రి భారతీయ జనౌషది పరియోజన వేర్ హౌజ్ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) ఉప్పల్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధ పరియోజన పథకం ద్వారా లార్వెన్ ఫార్మా అండ్ సర్జికల్స్ వారు ఏర్పాటుచేసిన ప్రధాన మంత్రి భారతీయ జనౌషధ పరియోజన తెలంగాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను గౌవర
గవర్నర్


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

ఉప్పల్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధ పరియోజన పథకం ద్వారా లార్వెన్ ఫార్మా అండ్ సర్జికల్స్ వారు ఏర్పాటుచేసిన ప్రధాన మంత్రి భారతీయ జనౌషధ పరియోజన తెలంగాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను గౌవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..

నాణ్యమైన ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలనే మన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా, పీఎంబీఐ-లార్వెన్ జనఔషధి డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వేర్హౌస్ను ఆదివారం మీతో కలిసి ప్రారంభించుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన మన ప్రభుత్వంలోని అత్యంత ప్రభావవంతమైన ప్రజా ఆరోగ్య కార్యక్రమాలలో ఒకటి.

నాణ్యమైన జనరిక్ మందులను తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వార, ముఖ్యంగా గ్రామీణ,వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు, వైద్య ఖర్చుల్లో వేల కోట్ల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఈ రోజు తెలంగాణకు ఒక గర్వకారణమైన రోజు. ఉప్పల్లో ఈ ఆధునిక వేర్హౌస్ ప్రారంభంతో, రాష్ట్రంలోని ప్రతి మూలకూ తక్కువ ధరలో మందులు వేగంగా, సమర్థవంతంగా చేరేలా చేసే బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పరుస్తున్నాం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande