జనసేన కేంద్ర కార్యాలయంలో ల్యాండ్ అయిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన మంత్రులు ఈ రోజు జనసేన కేంద్ర కార్యాలయంలో తమ హెలికాఫ్టర్ తో ల్యాండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
తెలంగాణ మంత్రులు


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన మంత్రులు ఈ రోజు జనసేన కేంద్ర కార్యాలయంలో తమ హెలికాఫ్టర్ తో ల్యాండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి లు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను మంగళగిరికి వెళ్లారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ పై మంత్రుల హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తరుఫున ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికారు. అనంతరం జనసేన కార్యకర్తలు మంత్రులతో కలిసి ఫోటోలు దిగారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande