'వార్-2' సినిమా ప్రీ-రిలీజ్.. హైదరాబాదులో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) టాలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ''వార్-2'' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసుఫ్గూడలో జరుగనుంది. ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో అట్టహాసం
ట్రాఫిక్ ఆంక్షలు


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) టాలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోలు

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన 'వార్-2' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసుఫ్గూడలో జరుగనుంది. ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. దేవర హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తుండటం, అందులోనూ బాలీవుడ్ ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. దీంతో యూసుఫ్గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ప్రయాణికులు కేవీబీఆర్ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో పోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9010203626 నంబర్లోకానీ, @HYDTP సోషల్ మీడియాలో ఫాలోకావాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande