రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..
తెలంగాణ, వేములవాడ. 10 ఆగస్టు (హి.స.) ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవు రోజులు కావడంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని ద
రాజన్న ఆలయం


తెలంగాణ, వేములవాడ. 10 ఆగస్టు (హి.స.)

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవు రోజులు కావడంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనం కొరకు సుమారు 4 గంటల సమయం పట్టినట్టు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు వేలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande