ఝార్ఖండ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైళ్లు
జంశెద్‌పూర్‌/కోల్‌కతా::,10 ఆగస్టు (హి.స.) ఝార్ఖండ్‌లోని సరైకెలా-ఖర్సవాన్‌ జిల్లాలో ఆద్రా డివిజన్‌ పరిధిలోని రెండు గూడ్స్‌ రైళ్లు శనివారం పట్టాలు తప్పాయి. దీంతో అనేక ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చింది.
ఝార్ఖండ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైళ్లు


జంశెద్‌పూర్‌/కోల్‌కతా::,10 ఆగస్టు (హి.స.) ఝార్ఖండ్‌లోని సరైకెలా-ఖర్సవాన్‌ జిల్లాలో ఆద్రా డివిజన్‌ పరిధిలోని రెండు గూడ్స్‌ రైళ్లు శనివారం పట్టాలు తప్పాయి. దీంతో అనేక ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చింది. చాండిల్, నిమ్డీహ్‌ రైల్వేస్టేషన్ల మధ్య డబుల్‌ లైన్‌ ట్రాక్‌లో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు గూడ్స్‌ రైళ్లలోని ఒక దాంట్లో బోగీలు పట్టాలు తప్పి.. ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలు మధ్యభాగాన్ని తాకాయి. దీంతో ఆ రైలులోని బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఎవరికీ గాయాలు కాలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande