శశి థరూర్ యూటర్న్.. ఇండియా కూటమి ర్యాలీలో ప్రత్యక్షం
న్యూఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.) ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్కు మార్చ్ చేపట్టింది. విపక్ష ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రానికి, ఈసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప
శశి థరూర్


న్యూఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.)

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్కు మార్చ్ చేపట్టింది. విపక్ష ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రానికి, ఈసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే అనుమతి లేదంటూ బారీకేడ్లు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఎంపీలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతలో మహిళా ఎంపీలు, అఖిలేష్ యాదవ్ బారీకేడ్లు దూకే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే ఆశ్చర్యంలో కాంగ్రెస్తో అంటీముట్టనట్టుగా ఉండే శశిథరూర్ అనూహ్యంగా రాహుల్గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈసీ ఆఫీస్కు చేపట్టిన మార్చ్ లో శశిథరూర్ కూడా ప్రత్యక్షమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande