ఇండిగో విమానయాన సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా
దిల్లీ:,10 ఆగస్టు (హి.స.) ఓ మహిళా ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, తడిసిన సీటును కేటాయించినందుకు ఇండిగో (Indigo) విమానయాన సంస్థ భారీ జరిమానా (Fine) చెల్లించాల్సి వస్తోంది. ఎయిర్‌లైన్స్ సేవా లోపం కారణంగా రూ.1.5 లక్షలు చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల ఫో
Trainee plane crashes near Ucharpi village in Mehsana district, woman pilot injured


దిల్లీ:,10 ఆగస్టు (హి.స.)

ఓ మహిళా ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, తడిసిన సీటును కేటాయించినందుకు ఇండిగో (Indigo) విమానయాన సంస్థ భారీ జరిమానా (Fine) చెల్లించాల్సి వస్తోంది. ఎయిర్‌లైన్స్ సేవా లోపం కారణంగా రూ.1.5 లక్షలు చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల ఫోరం ఆదేశించింది. పింకీ అనే మహిళ ఈ ఏడాది జనవరి రెండో తేదీన బాకు నుంచి న్యూఢిల్లీ (New Delhi)కి ఇండిగో విమానంలో ప్రయాణించారు.

ఆ సమయంలో ఆమెకు ఇండిగో విమానంలో బాగా తడిసిపోయిన, మురికిగా ఉన్న సీటును కేటాయించారు (Dirty Seat To Passenger). ఆ సీట్ మార్చమని అడిగిన తర్వాత కూడా సిబ్బంది నుంచి స్పందన లేదు. దీంతో ఆ సీటులోనే పింకీ ప్రయాణించారు. అనంతరం తనకు కలిగిన అసౌకర్యం గురించి ఢిల్లీ వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశారు. అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో వాదనను వినిపించింది. సీటు విషయంలో పింకీ ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి ఆమెకు వేరే సీటు కేటాయించామని, ఆమె ఇష్టపూర్వకంగానే న్యూఢిల్లీకి తన ప్రయాణాన్ని పూర్తి చేశారని ఎయిర్‌లైన్స్ తెలిపింది

8

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande