దిల్లీ:,10 ఆగస్టు (హి.స.)
, ఈరోజు బెంగళూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మరో 3 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. నేటి ఉదయం 11 గంటలకు బెంగళూరులోని క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్ లో ఈ మూడు రైళ్లకూ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు ఆయన. ఇక, బెంగళూరు- బెళగావి, అజ్ని (నాగ్ పూర్)- పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా మార్గాల్లో కొత్తగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ మార్గాన్ని కూడా మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించనున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ