పాక్‌తో భారత్‌ మ్యాచ్‌ ఆడటమేంటి?.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
దిల్లీ:,10 ఆగస్టు (హి.స.) ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య జరగబోయే క్రికెట్‌ మ్యాచ్‌పై ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.. పాకిస్తాన్‌తో భారత్‌ క్రికెట్‌ ఎలా ఆడుతుంది అంట
-owaisi


దిల్లీ:,10 ఆగస్టు (హి.స.) ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య జరగబోయే క్రికెట్‌ మ్యాచ్‌పై ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.. పాకిస్తాన్‌తో భారత్‌ క్రికెట్‌ ఎలా ఆడుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ్యాచ్‌కు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చింది అంటూ నిలదీశారు.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జాతీయ మీడియా పోడ్‌ కాస్ట్‌లో మాట్లాడుతూ..‘నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని.. చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చాలా సార్లు చెప్పారు. ఇలా మాట్లాడి.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్‌తో ఎలా క్రికెట్‌ ఆడుతారు. దుబాయ్‌లో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఈ మ్యాచ్‌ను చూడను. పాక్‌తో భారత్‌.. వాణిజ్య సంబంధాలను తెంచుకున్నారు, గగనతలాన్ని మూసివేశారు. కానీ, మీరు క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నించారు. పాక్‌తో ఆడటానికి కేంద్రం ఎలా అనుమతి ఇస్తుంది. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక వ్యామోహం. క్రికెట్‌ ప్రతీ దాన్ని స్తంభింపజేస్తుంది అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande