హర్యానాలో భూకంపం
న్యూ డిల్లీ, 11 ఆగస్టు (హి.స.)హర్యానాలో భూకంపం సంభవించింది. ఝజ్జర్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భయంతో జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశ
Earthquake today


న్యూ డిల్లీ, 11 ఆగస్టు (హి.స.)హర్యానాలో భూకంపం సంభవించింది. ఝజ్జర్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భయంతో జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలు అధికారులు వెల్లడించలేదు.

ఈ భూకంపం మధ్యాహ్న 4:10 గంటలకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని ఎన్‌సీఎస్ తెలిపింది. అయితే దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande