జగదీప్ ధనఖడ్ ఎక్కడున్నారు..? : అమిత్ షా కు సంజయ్ రౌత్ లేఖ
న్యూఢి, 11 ఆగస్టు (హి.స.) ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధనఖడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోతున్న
జగదీప్


న్యూఢి, 11 ఆగస్టు (హి.స.) ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధనఖడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోతున్నారు. దీంతో 'జగదీప్ ధనఖడ్ ఎక్కడ..?' అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయమై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.ధనఖడ్ ను తాము చేరుకోలేకపోతున్నామని, ఆయన ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసినప్పటి నుంచి ధనడ్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన భద్రతపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ధనడ్కు ఏం జరిగింది..? ఆయన క్షేమంగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా..? అని ప్రశ్నించారు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ ఎంపీలు ప్రయత్నించినట్లు చెప్పారు. కానీ, ఆయన్ని చేరుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఆయన ప్రస్తుత లొకేషన్ ఏంటి? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని లేఖలో సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande