భయంకర విషాదాన్ని మేము తృటిలో తప్పించుకున్నాం.
అగ్రనేత కేసీ వేణుగోపాల్
AIR INDIA


హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI2455)లో టెక్నికల్‌ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్‌ చెన్నైలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. వివరాల ప్రకారం.. విమానం రెండు గంటలకు పైగా గాలిలో ఉండి.. చివరకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం రాత్రి 8 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి.. రాత్రి 10.35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయిందని సమాచారం.

ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. ఎంపీలు కేసీ వేణుగోపాల్, కోడిక్కున్నిల్ సురేష్, అదూర్ ప్రకాష్, కే రాధాకృష్ణన్, రాబర్ట్ బ్రూస్‌లు తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందించారు. పైలట్‌ తక్షణ నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలను కాపాడిందన్నారు. ‘భయంకర విషాదాన్ని మేము తృటిలో తప్పించుకున్నాం. నైపుణ్యం, అదృష్టం రెండూ మమ్నల్సి కాపాడాయి. క్లియరెన్స్ కోసం దాదాపు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వేపై మరొక విమానం ఉంది. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులకు ఎప్పటికీ అదృష్టం కలిసిరాదు. ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుకుతున్నా’ అని కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande