కడప, 11 ఆగస్టు (హి.స.)
జిల్లాలో మినీ సంగ్రామాన్ని తలపించే విధంగా జరిగిన పులివెందుల ), ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ( ఆదివారం సాయంత్రం 5గంటలకు పరిసమాప్తమైంది. ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ నుంచి కూటమికి సంబంధించి మంత్రులు సవిత, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్ధనరెడ్డి, ఫరూక్, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక కలెక్టరు, డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 1400 మంది పోలీసులను నియమించారు. డీఐజీ కోయప్రవీణ్ ఆధ్వర్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ