వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ మిల్క్‌షేక్ ట్రై చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..!
కర్నూలు, 11 ఆగస్టు (హి.స.) జిమ్‌కు వెళ్లే వారు, వెయిట్ లాస్ టార్గెట్ ఉన్నవారికి ఈ హెల్తీ మిల్క్‌షేక్ చాలా ఉపయోగంగా ఉంటుంది. షుగర్ లేకుండా నేచురల్ ఇంగ్రిడియంట్స్‌తో తయారయ్యే ఈ షేక్ బాడీకి ఎనర్జీని ఇస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. మార్నింగ్ బ్రేక్‌ ఫ
వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ మిల్క్‌షేక్ ట్రై చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..!


కర్నూలు, 11 ఆగస్టు (హి.స.)

జిమ్‌కు వెళ్లే వారు, వెయిట్ లాస్ టార్గెట్ ఉన్నవారికి ఈ హెల్తీ మిల్క్‌షేక్ చాలా ఉపయోగంగా ఉంటుంది. షుగర్ లేకుండా నేచురల్ ఇంగ్రిడియంట్స్‌తో తయారయ్యే ఈ షేక్ బాడీకి ఎనర్జీని ఇస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. మార్నింగ్ బ్రేక్‌ ఫాస్ట్‌ లో తీసుకుంటే ఫ్యాట్ బర్న్, ఫిట్‌నెస్ మెయింటైన్‌ చేయడంలో సహాయపడుతుంది.

జిమ్‌కు వెళ్లే వారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ స్పెషల్ మిల్క్‌షేక్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇది బాడీకి ఎనర్జీని ఇచ్చి, హెల్దీగా ఉంచుతుంది. ఈ మిల్క్‌షేక్‌లో నాచురల్ ఇంగ్రిడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇందులో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఈ షేక్ తాగితే బాడీకి రోజంతా ఎనర్జీ ఉంటుంది.

మిల్క్‌ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు

అరటిపండ్లు – 1 (మీడియం సైజు)

నానబెట్టిన డేట్స్ – 3 నుంచి 4

గుమ్మడి గింజలు – 1 టీస్పూన్

నానబెట్టిన బాదం – 4 నుంచి 5

పచ్చి పాలు – 1 గ్లాస్ (సుమారు 200 నుంచి 250 ml)

తయారీ విధానం

మిక్సీ జార్‌లో ముందుగా అరటిపండు, నానబెట్టిన ఖర్జూరాలు, పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేయండి. ఆ తరువాత గుమ్మడి గింజలు కలపాలి.. వీటిని పొడి రూపంలో వేసుకున్నా మంచిదే. గుమ్మడి గింజలు శరీరంలోని చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. చివరగా నానబెట్టిన బాదంను కూడా కలిపి బ్లెండ్ చేస్తే మిల్క్‌షేక్ మరింత రుచికరంగా, శక్తివంతంగా మారుతుంది.

ఎప్పుడు తాగాలి..?

ఈ మిల్క్‌షేక్‌ను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.. కొద్దిగా సలాడ్ లేదా లో కార్బ్ ఫుడ్‌తో పాటు తీసుకోవచ్చు. ఇది మధ్యాహ్నం వరకూ ఆకలి వేయకుండా చేస్తుంది. బాదంలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ బాడీని స్ట్రాంగ్‌ గా ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఈ మిల్క్‌షేక్‌ను తీసుకోకూడదు. ఎందుకంటే బనానాలో నాచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచే ఛాన్స్ ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande