రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ భీమా యోజన నిధులు విడుదల
ఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.) రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం నిధులు నేరుగా రైతుల అకౌంట్లలోకి ఈ రోజు విడుదల చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ రోజు సోమవారం రాజస్థాన్ లోని జుంజునులో జరిగే కార్యక్రమంలో
రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ భీమా యోజన నిధులు విడుదల


ఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.)

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం నిధులు నేరుగా రైతుల అకౌంట్లలోకి ఈ రోజు విడుదల చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఈ రోజు సోమవారం రాజస్థాన్ లోని జుంజునులో జరిగే కార్యక్రమంలో దేశంలోని 30 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.3,200 కోట్ల నిధులను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విడుదల చేయనున్నారు.

ఈ నిధుల్లో అత్యధికంగా రూ.1,156 కోట్ల నిధులు మధ్యప్రదేశ్ రైతుల అకౌంట్లలో జమ కానుండగా.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రైతుల ఖాతాల్లో రూ.1,121 కోట్లు జమ కానున్నాయి. మిగిలిన రాష్ట్రాల రైతుల ఖాతాల్లో మిగతా రూ.903 కోట్ల నిధులు జమ కానున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande