రేపల్లెకు పలు రైళ్లు రద్దు.. కారణం ఇదే...!
తెనాలి, 11 ఆగస్టు (హి.స.)తెనాలి(Tenali) నుంచి రేపల్లె(Repalle) వెళ్లే ప్యాసింజర్లకు రైల్వే అధికారులు కీలక సమాచారం ప్రకటించారు. ఈ రూటులో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చుండూరు-తెనాలి-పెద్దవడ్లమూడి మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతులు పనులు జర
Train


తెనాలి, 11 ఆగస్టు (హి.స.)తెనాలి(Tenali) నుంచి రేపల్లె(Repalle) వెళ్లే ప్యాసింజర్లకు రైల్వే అధికారులు కీలక సమాచారం ప్రకటించారు. ఈ రూటులో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చుండూరు-తెనాలి-పెద్దవడ్లమూడి మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతులు పనులు జరుగుతున్నాయని, ఈ నెల 24 వరకూ రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రూటు ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 24న రైళ్ల పునరుద్ధరణపై సమాచారం అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande