అమరావతి, 11 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ(Weather Department) బిగ్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ నెల 13న బంగాళాఖాతం(Bay of Bengal)లో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. అంతేకాదు దక్షిణ కోస్తాంధ్ర(South Coastal Andhra) మీదుగా ఉపరితలం ఆవర్తనం ఏర్పడుతుందని స్పష్టం చేసింది. దీని వల్ల రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే ఈ నెల 13, 14న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ఆ సమయంలో రైతులు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ తెలిపింది
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి