అయోధ్య, 12 ఆగస్టు (హి.స.)
అయోధ్యలోని రామమందిరానికి రక్షణ గోడ నిర్మించాలని భద్రతా నిపుణులు సూచించారు. దీంతో త్వరలో 4 కిలోమీటర్ల గోడతో కోట లాంటి భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.80-90 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది. ఈ ప్రాజెక్టు రాబోయే 15 రోజుల్లో ప్రారంభమవుతుందని.. పూర్తి కావడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఆలయ సముదాయంలోని ఉత్తరం వైపు నుంచి నిర్మాణం ప్రారంభమై మొత్తం చుట్టు కవర్ అయ్యే వరకు దశలవారీగా పనులు కొనసాగనున్నాయి. మతపరమైన ప్రదేశానికి రక్షణ వ్యవస్థ ముఖ్యమైన భాగం అని భద్రతా నిపుణులు పేర్కొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ నిర్మాణం చేపడుతోంది. 14-16 అడుగుల ఎత్తులో మూడు అడుగుల ఉక్కు కంచెతో ఈ గోడ నిర్మాణం జరుగుతుంది. అనధికార ప్రవేశాన్ని నిరోధించడానికి అధునాతన నిఘా పరికరాలు, వాచవర్లు ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణ బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కు అప్పగించింది. ఈ గోడ నిర్మాణంతో ఆలయ భద్రతతో పాటు ఆధ్మాత్మిక పవిత్రతను కూడా బలోపేతం చేస్తుందని ట్రస్ట్ సీనియర్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్