హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)
15వ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని
పురస్కరించుకొని ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా, ర్యాలీ కార్యక్రమాలు జరగనున్నాయని.. ఈ కార్యక్రమాలను తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించాలని BJP రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్రావు పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరు తమ ఇళ్లపై, విద్యా సంస్థలపై, ప్రభుత్వ కార్యాలయాలపై, జాతీయ జెండాలు ఎగురవేయాలని కోరారు. HYDలో ఆగస్టు 14న నెక్లెస్ రోడ్డులో 15 వేల మంది విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..