పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ, వనపర్తి. 12 ఆగస్టు (హి.స.) పేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. రోగులతో మాట్లాడి అక్కడే ఉన్న ప్రభుత్వ డయాగ్నస్ట
నిరంజన్ రెడ్డి


తెలంగాణ, వనపర్తి. 12 ఆగస్టు (హి.స.)

పేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. రోగులతో మాట్లాడి అక్కడే ఉన్న ప్రభుత్వ డయాగ్నస్టిక్స్ హబ్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తుందన్నారు. గతంలో వనపర్తి టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ సిరిసిల్ల తర్వాత రెండోస్థానంలో ఉంది. సర్కారు నిర్లక్ష్యంతో నేడు 12వ స్థానానికి దిగజారింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

టీ డయాగ్నస్టిక్లో 134 టెస్టులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం జరుగుతున్నది 95 టెస్టులు మాత్రమేనన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande