అధ్యాపకులకు ఐఐటీఎంలో ఉచిత శిక్షణ
దిల్లీ:12 ఆగస్టు (హి.స.) కళాశాలల్లో బోధించే ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, బయో టెక్నాలజీ అధ్యాపకులకు ఐఐటీ మద్రాస్‌ (ఐఐటీఎం) ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనుంది. పీజీ, యూజీ సైన్స్‌ కోర్సులను బోధించేవారికి సబ్జెక్టుపై మరింత పట్టు వచ్చేలా మాలవీయ మిషన్‌
అధ్యాపకులకు ఐఐటీఎంలో ఉచిత శిక్షణ


దిల్లీ:12 ఆగస్టు (హి.స.)

కళాశాలల్లో బోధించే ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, బయో టెక్నాలజీ అధ్యాపకులకు ఐఐటీ మద్రాస్‌ (ఐఐటీఎం) ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనుంది. పీజీ, యూజీ సైన్స్‌ కోర్సులను బోధించేవారికి సబ్జెక్టుపై మరింత పట్టు వచ్చేలా మాలవీయ మిషన్‌ టీచర్‌ ట్రెయినింగ్‌ పథకం (ఎంఎంటీటీపీ) కింద ఈ శిక్షణ అందిస్తామని సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ లింకు ద్వారా ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని, 9 రోజులపాటు ఐఐటీఎంలోని ‘టీచర్‌ లెర్నింగ్‌ సెంటర్‌(టీఎల్‌సీ)’ హాల్, సెంట్రల్‌ లైబ్రరీలో శిక్షణ ఉంటుందని టీఎల్‌సీ ఛైర్మన్, ఆచార్యులు ఎడమన ప్రసాద్‌ పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన తర్వాత ఎంపికయినవారికి మెయిల్‌ ద్వారా సమాచారం ఇస్తారు. ఆగస్టు 22 నుంచి బయోటెక్నాలజీ వారికి శిక్షణ ప్రారంభం కానుండగా తర్వాత సబ్జెక్టుల వారీగా తరగతులు కొనసాగుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande