హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)
కేంద్రమంత్రి బండి సంజయ్ కి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ఫోన్ టాపింగ్ కేసులో బండి సంజయ్ అసత్యపూరితంగా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజా ప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం అంటూ నోటీసులలో పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్