తెలంగాణ, నల్గొండ. 12 ఆగస్టు (హి.స.)
సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు నీళ్లులేవు. రాష్ట్ర మంత్రులు కట్ట మీద చర్చకు సిద్ధం కావాలి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ఉదయ సముద్రం చెరువు వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా బేసిన్లోకి పుష్కలంగా నీరు వచ్చి, సాగర్ గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. కానీ, జిల్లాలో పూర్తి స్థాయిలో చెరువులు నింపకుండా, మేజర్ల కింద, డిస్ట్రిబ్యటరీల కింద నీళ్లు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం శారు.
దేవరకొండ, నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గంలో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రులు దద్దమ్మలని మరో సారి రుజువు అయింది. కోమటిరెడ్డి, ఉత్తమ్ ఇద్దరు అసమర్థులే అని మండిపడ్డారు. కేవలం కమీషన్లు, ఆర్భాటాలు తప్పితే ఈ మంత్రుల వల్ల జిల్లాకు ఒరిగింది ఏంలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు