మేమిద్దరం అన్నదమ్ములమని అప్పుడు తెలియదా?.. మరోసారి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్!
హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని కాంగ్రెస
రాజగోపాల్ రెడ్డి హాట్


హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని కాంగ్రెస్ హైకమాండ్కు తెలియదా? అనిమండిపడ్డారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే అని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? అని అడిగారు. ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతా అని, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

'నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరడ్డుకుంటున్నారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉంది. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే. మా ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి?. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. భువనగిరి పార్లమెంటు నుంచి ఎంపీగా పని చేశాను, నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉంది' అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande